

బైంసా నుండి కత్తిగాం మీదుగా కామోల్ వరకు తార్ రోడ్డు వేయాలని ఆమరణ నిరాహార దీక్ష:-
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 08 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఖతగామ్ టు కామోల్ వరకు తార్ రోడ్డు వేయాలని కత్తిగామ్ మాజీ సర్పంచ్ డాక్టర్ దేగ్లూర్ రాజు శనివారం కత్తిగామ్ చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు మూడు పర్యాయములు టెండర్లు వేసినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదని, కత్తిగామ్, కామోల్ మీదుగా తార్ రోడ్డు వేసినట్లయితే నిజామాబాద్ జిల్లా నందిపేట్ వరకు సుదీర్గా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి తార్ రోడ్డు వేయాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తెలియజేస్తూ,డాక్టర్ దెగ్లూర్ రాజు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట మహేష్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం తారు రోడ్డు వేసి ప్రజల ప్రయాణ సౌకర్యార్థం కోసం ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మోతీ సంఘం జిల్లా అధ్యక్షులు గంగా సముద్రం సాయినాథ్, రజక సంఘం బైంసా టౌన్ అధ్యక్షుడు సుంకేటా శ్రీనివాస్ గ్రామస్తులు పాపన్న,మారుతి పటేల్, అడెల్లు,లక్ష్మణ్ పటేల్,ఉప్పొళ్ల పండరి,విట్టల్, గంగాధర్ పటేల్, మాధవ్ పటేల్, ఘాజి బాయ్, వర్గంటి లక్ష్మణ్, గంగుబాయి, మున్నిబాయి, మస్తాన్రావు, పలువురు గ్రామస్తులు మద్దతు ఇవ్వడం జరిగింది.