

బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతడు ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.మూడు రోజుల క్రితం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సాయి తేజను కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండురోజులుగా చికిత్స పొందుతున్న అతను నేడు మృతి చెందాడు.ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బట్టింగ్ యాప్‌ల ప్రభావంతో యువత ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.