

బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత
పోలీసుల మాటలలో విందాం బెట్టింగ్ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా…! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా…! అంటూ బెట్టింగ్ యాప్స్‌పై ఫుల్ సీరియస్‌గా ముందుకెళ్తున్నారు పోలీసులు. మొక్కకి అంటు కట్టినట్లు ఓ పద్దతిగా బెట్టింగ్ బూజు దులుపుతున్నారు. మరిప్పటివరకూ నోటీసులందుకున్న వాళ్లెవరు…? విచారణకు హాజరైంది ఎంతమంది…? ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని పత్తాలేకుండా పోయిన లిస్ట్ సైజ్ ఎంత…? హాట్‌టాపిక్‌గా మారిన విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణ ఎంతవరకొచ్చింది..? బెట్టింగ్ మాయాజాలంలో తెలియకుండానే కూరుకుపోతున్న నేటి యువత తెగిపడిన గాలిపటం వలె ఏమి చేయాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సరదా కోసం బెట్టింగ్ యాప్ ఆడి డబ్బులు అలాగే కుప్పలు తప్పులుగా కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసి కట్టలేక ఎవరికీ చెప్పుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న నేటి యువత.
Cricket Betting Apps ఇండియాలో క్రికెట్ బెట్టింగ్‌కి టాప్ 5 యాప్స్ ఇవే!
క్రికెట్‌పై బెట్టింగ్ వేసేవారికి.. బెట్టింగ్ యాప్స్‌పై మంచి అవగాహన ఉంటుంది. మరి ఇండియాలో క్రికెట్ బెట్టింగ్‌కి ఫేమస్ అయిన టాప్ 5 యాప్స్ ఏవో తెలుసుకుందాం.
ఇండియాలో బెట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. ఐతే.. అన్నీ మంచివే అని చెప్పలేం. కొన్ని యాప్స్.. విత్‌డ్రా మనీ త్వరగా ఇవ్వవు. మరికొన్ని బెట్టింగ్‌లో తేడా వస్తే, తప్పు మనదే అంటాయి. ఇలా కస్టమర్లను ఇబ్బంది పెడతాయి. అందుకే బెట్టింగ్ అనేది ప్రమాదకరంగా మారుతోంది. చాలా మంది బెట్టింగ్‌లో నష్టపోతున్నారు. కొంతమంది మాత్రం సరదాగా బెట్టింగ్ ఆడతారు. అందువల్ల ఇండియాలో ఫేమస్ అయిన 5 బెట్టింగ్ యాప్స్ ఏవో తెలుసుకుందాం. ఈ యాప్స్ మంచివేనా? వీటిలో బెట్టింగ్ ఆడితే గెలుస్తామా? అనేదానికి ఎలాంటి గ్యారెంటీ లేదు. కాకపోతే, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ యాప్స్ వాడుతున్నారు. వీటి వెల్‌కం బోనస్, యాప్ పనితీరు, చెల్లింపుల విధానం, యాప్ లుక్, యాప్ లైసెన్స్, యాప్ ప్రమోషన్స్ వంటి అంశాల ఆధారంగా ఇవి ఫేమస్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్స్ ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ లభిస్తున్నాయి.
Parimatch
పారీమ్యాచ్ యాప్ మీరు వినే ఉంటారు. ఈ మధ్య ఆ యాప్ యాడ్స్ చాలా వస్తున్నాయి. ఈ యాప్‌లో వెల్‌కం బోనస్ రూ.30వేలు ఇస్తున్నారు. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇందులో క్రికెట్ మాత్రమే కాదు.. క్యాసినో, వర్చువల్ స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా చాలా ఉన్నాయి.
Battery
బ్యాటరీ యాప్ కూడా ఇలాంటిదే. దీనికి 4.9 రేటింగ్ ఉంది. ఇందులో వెల్‌కం బోనస్ 20వేలు ఇస్తున్నారు లేదా మొదటి డిపాజిట్ తర్వాత దానికి 200 శాతం బోనస్ ఇస్తామని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ ఉంది.
MegaPari
మెగా పారీ యాప్ మరోరకం. దీనికి 4.8 రేటింగ్ ఉంది. దీనికి వెల్‌కం బోనస్ రూ.26వేలు ఇస్తున్నారు. ఇందులో కూడా క్రికెట్‌తోపాటూ చాలా రకాల మ్యాచ్‌లకు బెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే క్యాసినో, వర్చువల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.
Mostbet
మోస్ట్ బెట్ యాప్‌కి 4.7 రేటింగ్ ఉంది. దీనికి వెల్‌కం బోనస్ రూ.34వేలు ఇస్తున్నారు. ఈ యాప్ ఆకర్షణీయంగా ఉంటుంది. దీని డిజైన్, లుక్ బాగుంటుంది. గ్రాఫిక్స్ కూడా కళ్లకు కూల్‌గా ఉంటాయి. ఇందులో కూడా క్రికెట్‌తో పాటూ చాలా రకాల బెట్టింగ్స్ ఉన్నాయి.
22bet
ఈ యాప్‌కి 4.6 రేటింగ్ ఉంది. దీనికి వెల్‌కం బోనస్ రూ.10వేలు ఇస్తున్నారు. ఇందులో కూడా స్పోర్ట్స్, లైవ్, జాక్‌పాట్, క్యాసినో, పోకర్ ఇలా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. వర్చువల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. (disclaimer: బెట్టింగ్స్ అనేవి రిస్క్‌తో కూడినవి. మనీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
Betting Apps : బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతున్న పంజాగుట్ట పోలీసుల విచారణ..
యాప్స్ కి ప్రమోషన్ చేసిన 11మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
ఇందులో ఒకరు హాజరు కాగా మిగతా అందరూ పరారీ
పోలీసులకు అందుబాటులోకి రాని పదిమంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు.యాంకర్ విష్ణుప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆమెకు అందించిన నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా మంగళవారం విచారణకు విష్ణుప్రియ హాజరుకాలేదు. అలాగే ఈ రోజు మరి కొంత మంది ఇన్‌ఫ్లుయన్సర్లు, ప్రమోటర్ లకు నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. నటి మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరు తాము తెలియక ప్రమోట్ చేశామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను పంజాగుట్ట పోలీసుల నుండి ఈడి తీసుకుంది. ఈడి ఎంటర్ కావడంతో కేసులు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారేమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు.. రంగంలోకి పోలీసులు..
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, యూత్ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులోభాగంగానే…యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలిచారు. షూటింగ్‌లో ఉన్నాం… మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు డుమ్మా కొట్టారు. వాళ్లిద్దరి తరుఫున రంగంలోకి దిగిన ఆర్జే శేఖర్ భాషా.. సమయం కావాలని పోలీసులను కోరారు. దీంతో వాళ్లకు మరో మూడు రోజుల సమయం కేటాయించిప్పటికీ.. అందరికీ షాక్ ఇస్తూ నిన్న రాత్రే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ. విష్ణుప్రియ మాత్రం విచారణకు వచ్చేందుకు పోలీసులిచ్చిన మూడ్రోజుల సమయానికే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది…!
ఇకీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి…. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్‌బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చినవాళ్లలో కొందరు ఫోన్లు స్విచ్చాఫ్ చేయడంతో వాళ్ల కోసం పోలీసులు వేట షురూ చేశారు.
పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌పైనా కేసు నమోదైంది. అలాగే లోకల్ బాయ్ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పరారీలో ఆ ఇద్దరు..?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇప్పటికే 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చారు. అయితే.. వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్‌కి పరారైనట్లు సమచారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల.. ఆధారాలను సేకరిస్తున్నపరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌పైనా కేసు నమోదైంది. అలాగే లోకల్ బాయ్ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌పైనా కేసు నమోదైంది. అలాగే లోకల్ బాయ్ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొందరి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది… అప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం, ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఏదిఏమైనా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిని వదిలే ప్రసక్తేలేదంటున్నారు పోలీసులు. మొత్తంగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరికి ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు