

బెట్టింగ్, గంజాయి నియంత్రణ పై నిఘా ఉంచాలి..!!
సిద్దిపేట: క్రికెట్ బెట్టింగ్స్, గంజాయి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణచివేయాలని పోలీసు కమిషనర్ డా. అనురాధ పోలీసు అధికారులను ఆదేశించారు.
పోలీసు కమిషనరేట్ లో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్దిపేట ఏసీపీ మధు, ఇన్ స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్ లను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ..కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలన్నారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఫోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. దొంగతనాల నివారణ గురించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్ రావాలి వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరగా సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఆర్బీ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ, ఎస్పీ ఇన్ స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, ఏఓ యాదమ్మ, సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు