బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.
-జిల్లా బీసీ సంక్షేమ సంఘము.
అధ్యక్షుడు ఎంబడి.చంద్రశేఖర్.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 18 :-నిర్మల్ జిల్లా: - బీసీ ప్రజాలు విద్య.ఉద్యోగ.రాజకీయ,ఆర్థిక,సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలపడం హర్షణీయం అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎంబడి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బీసీ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లు బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం సంతోషదాయకం అన్నారు ముఖ్యంగా విద్య.ఉద్యోగలతోఅటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు పెద్ద ఎత్తున్న రాజకీయంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు