బీసీ ఎస్సీ ఎస్టీల ఆరాధ్య దైవం కాన్షీరామ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 15 :-15% ఉన్న అగ్రకులాలే ఈ దేశంలోని భూమి,సంపద, రాజకీయ అధికారాలను అనుభవిస్తున్నారని పోరాటం చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్నింటిలో వాటా పంచిన ఆరాధ్యుడు కాన్షీరామ్ అని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూమేష్ మహారాజ్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాన్షీరామ్ 91 వ జయంతిని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తూ డాక్టర్ అంబేడ్కర్ ఆశయాన్ని కొనసాగించిన మహోన్నతుడు కాన్షీరామని కొనియాడారు. అంతకుముందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు సుధాకర్ రాజు మహారాజ్ కుందూరు వినోద్ కత్తి శేఖర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు