బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నార

బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నారని ప్రత్యేక నిఘా ద్వారా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్.
నిజామబాద్ జిల్లా,
బాల్కొండ మార్చి 27 మనోరంజని ప్రతినిధి,
బాల్కొండ నియోజకవర్గంలోని బస్సాపూర్ గ్రామం లో గత కొన్ని రోజులుగా ఎస్సీ మరియు బీసీల మధ్య చిన్నపాటి విభేదాల వల్ల దాదాపు 16 మంది బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ కేసులైనయని తగిన న్యాయం న్యాయం చేకూర్చాలని తన వద్దకు వచ్చారని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం బీసి లకు బీసీ అట్రాసిటీ ని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారికి చట్టబద్ధత కల్పించాలని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు, ప్రభుత్వాలు మారిన బీసీల తలరాతలు మారటం లేదని తెలిపారు,
తెలంగాణ బీసీ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ , మరియు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,
బీసీలపై జరుగుతున్నటువంటి అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే దానికి ముందుకు తీసుకెళ్లాలని అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వేయడం సరైన పద్ధతి కాదని అశోక్ గౌడ్ తెలిపారు, దీనిపైన మందకృష్ణ మాదిగ, డాక్టర్ విషాదరన్ మహారాజు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అశోక్ గౌడ్ తెలిపారు, ఈ విధంగా బీసీల పైన ఒత్తిడి లకు గురి చేస్తే మీరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నారని, కేవలం ఓటు రాజకీయమే కాదు వారి యొక్క బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయని వారు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పైన స్పందించాలని పిలుపునిచ్చారు, త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు రాజకీయాలలో 52 శాతం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కేవలం స్థానిక సంస్థ ఎన్నికలలో కాకుండా అసెంబ్లీలో కూడా 42 శాతం కాకుండా 52 శాతం బీసీలకు అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా
బాల్కొండ నియోజకవర్గం బస్సాపూర్ గ్రామ ప్రజల విషయంలో
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు.

  • Related Posts

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక…

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం