

బీసీల పట్ల బీఆర్ఎస్ కపట ప్రేమ: మల్లేష్ గౌడ్
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ | ఫిబ్రవరి 28 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీసీల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం వల్లే కులగణన జరుగుతోందని పేర్కొన్నారు.అయితే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. 40 ఏళ్లుగా బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు.
మల్లేష్ గౌడ్ విమర్శలు:
🔸 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 18%కి తగ్గించారని ఆరోపించారు.
🔸 బీసీ కార్పొరేషన్ రుణాలు అందించలేదని, నిరుద్యోగులకు న్యాయం చేయలేదని తెలిపారు. బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువ చేసి, అప్పటివాటిని ఇతర శాఖలకు మళ్లించారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో బీసీల ఎదుగుదల అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు కులగణనపై మాట్లాడటం అనాగరికమని అన్నారు. బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ నేతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈటల రాజేందర్, ఇతర బీసీ నేతలను పార్టీ నుండి తొలగించడం, పార్టీలో సామాజిక న్యాయం లేమి వంటి అంశాలను ప్రస్తావించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు.