

బీర్కూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన
పర్యటనకు సంబంధించిన సమాచారం బీసీ నాయకులకు ఇవ్వకపోవడంతో విచారంలో బిసి సామాజిక వర్గం
బీర్కూర్ బీసీ సామాజిక వర్గ నాయకులపై చిన్న చూపు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నేడు నియోజకవర్గం లో పర్యటన చేశారు, మధ్యాహ్నం రెండు గంటలకు బాన్సువాడ క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్త సమావేశం, మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మేక వీరాజ్ గారి మనవని నూతన వస్త్రధారణ, మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు నసురుల్లాబాద్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు గారి మాతృమూర్తి ఈ మధ్యకాలంలో చనిపోవడంతో వారి కుటుంబానికి మాత్రమే పరామర్శిస్తారు అని బీర్కూర్ మండల కార్యకర్తలకు, బిసి నాయకులకు సమాచారం తెలిపి, అనంతరం బీర్కూర్ మండల కేంద్రానికి బాన్సువాడ నియోజక వర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి రానున్నట్లు కార్యకర్తలకు బిసి నాయకులకు సమాచారం తెలపకుండా ఓసి నాయకులు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఏనుగు రవీందర్ రెడ్డి బీర్కూరు మండల కేంద్రంలో పర్యటించడంతో, తాను బీర్కూర్ వస్తున్నట్టు సమాచారం బీసీ నాయకులకు ఇవ్వలేదని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆశ్చర్యపోవడం జరిగింది.