

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది: విజయశాంతి
మనోరంజని ప్రతినిధి మార్చి 11 – తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినట్లు విజయశాంతి ఆరోపించారు. “తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారు. రాష్ట్రం ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది” అని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఈ అంశాన్ని తాను గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించానని పేర్కొన్నారు