

బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : హిందూ ముస్లింల సఖ్యతకు రూపమే ఇఫ్తార్ విందు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.దేశంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగ సందర్భంగా పురస్కరించుకొని పండుగ కంటే ముందు 30 రోజులు నెలవంక దర్శనం తర్వాత ప్రతిరోజు ఉపవాసం ఉంటూ భగవంతునికి ప్రార్ధనలు చేస్తూ ఉపవాస దీక్షలను పాటిసస్తారని అని ఎమ్మెల్సి నవీన్ రెడ్డిఅన్నారు.షాద్ నగర్ చౌరస్తాలోని మజీద్ లో బీఆర్ఎస్ నాయకుడు చిల్కమర్రి మాజీ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపిపి వై.రవీందర్ యాదవ్ మరియు బిఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచులు మోబిన్ ఘోరీ, అశోక్, మచ్చేందర్, రంగయ్య గౌడ్, భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,చందు నాయక్, చంద్రశేఖర్, రంగయ్య, సాయి యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింటూ, వెంకట్రాంరెడ్డి, జూపల్లి శంకర్, నాయకులు వీరేశం గుప్తా, నక్కల వెంకటేష్ గౌడ్, రఘుపతి రెడ్డి, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), బిలాల్, పర్వేజ్, అజహార్, సాధక్, చిలకమర్రి ఆనంద్, మహబూబ్, రహమత్ అలీ, అబ్బాస్, మినాజ్ తదితరులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.