

బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం
మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఓ విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి గోదావరి నది వద్ద కరెంట్ షాక్తో మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు