బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : బాలాపూర్ మండలం లో అందరికీ రుణ మాఫీ కాలేదు అని , రైతు భరోసా ను అందరికీ వెంటనే వేయాలి అని ది భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ నరసింహ రెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ లోని క్యాంపు కార్యాలయంలో మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ది భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ పరిధి లోని బాలాపూర్ , సరూర్ నగర్ లలో సంఘం యొక్క సర్వ సభ్య సమావేశము ఏర్పాటు చేయడం జరిగిందని, సమావేశములో నాదర్ గుల్, కుర్మల్ గూడ , బడంగ్ పేట్ రైతులు పాల్గొని ఋణ మాఫీ, రైతు బరోస ఇవ్వడము లేదని సమావేశము జరగకుండ అడ్డుపడినారు.మా సంఘంలో 321 మంది కి రూ . 212, 52, 872 మాఫీ కొరకు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. కానీ 221 మంది రైతులకు రూ. 138, 72, 188 మాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఇంకా రుణమాఫీ కానీ వారు 140 మంది రైతులు ఉన్నారని రూ .73 80 684 మాఫీ కావలసి ఉందని తెలిపారు. మాఫీ అయ్యేటట్లు చూడాలని సబిత ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతుబంధు గానీ రైతు రుణమాఫీ గాని జరగలేదని అన్నారు. ప్రభుత్వము గొప్పలకు పోయి అందరికీ రుణమాఫీ చేశామని చెప్తుందన్నారు. దాదాపు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం ఆర్భాటాలకు పోకుండా ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణమాఫీ చేయాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని రైతాంగానికి ఒక రోజులో రైతుబంధు డబ్బులు వారి అకౌంట్లో పడేవని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఎప్పుడు వేస్తున్నారో కూడా వారికి అర్థం కావడం లేదన్నారు. వెంటనే రైతుబంధులు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాబోవు ఖరిఫ్ సీజన్లో వ్యవసాయ ఖర్చులు ఇతర ఎరువులు,విత్తనాలు కొనుగోలు చేయవలసి ఉంటుంది అని, రైతులకు ఇబ్బంది అవ్వకుండా త్వరగా ఋణ మాఫీ,రైతు భరోసా ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు రాంరెడ్డి, బిమిడి జాంగా రెడ్డి, నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి , బొక్క రాజేందర్ రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం