బాబు టైలరింగ్ ఐడియా అదిరింది.

బాబు టైలరింగ్ ఐడియా అదిరింది.

ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది.

మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు… ఈ దఫా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికను రచించారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణలో ఏకంగా 1,02,832 మంది మహిళలు పాలుపంచుకోనున్నారు. శిక్షణ తర్వాత టైలరింగ్ లో సదరు మహిళలు ఆర్థికార్జనకు అవసరమైన ఇతరత్రా చేయూతను కూడా బాబు సర్కారు అందించనుంది. వెరసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది.

90 రోజుల పాటు జరగనున్న టైలరింగ్ శిక్షణా కార్యక్రమాలకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీఎస్), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు. ఇక ఈ శిక్షణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న ఈ శిక్షణా కేంద్రాల్లో 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు