

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 10 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అదేవిధంగా తరోడ గ్రామ మాజీ సర్పంచ్ సాయ గౌడ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట ముధోల్ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,శంకర్ చంద్రే, యూత్ అధ్యక్షుడు దొడ్డు ప్రసాద్, నాయకులు ముత్యం రెడ్డి, రాంచదర్ రెడ్డి,కిషన్ పతంగే, ప్రేమ్ నాథ్ రెడ్డి, అజిజ్, దిగంబర్, లక్ష్మన్, చంద్రకాంత్, నగేష్, అజ్మత్ ఖాన్, శశి కుమార్, తదితరులున్నారు.