

బాధిత కుటుంబాలకు పరామర్శ
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 05 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామానికి బద్దం మోహన్ రెడ్డి మాతృమూర్తి ఇటీవలే పరమపదించారు. అదేవిధంగా కుంటాల గ్రామానికి చెందిన సాదుల సుదర్శన్-ప్రముఖ న్యాయవాది సాదుల గోవర్ధన్ తండ్రి సాదుల లింబాద్రి (రిటైర్డ్ విఆర్ఓ) పరమపాదించడం జరిగింది. మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఆయన వెంట ముధోల్ మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, కుంటాల మండల నాయకులు, తదితరులు ఉన్నారు.