బాధిత కుటుంబానికి పరామర్శ
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :-
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మాజీ శాసనసభ్యుల వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ ఎంపీపీ రాజన్న, డైరెక్టర్ భూమన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, తదితరులు ఉన్నారు