

బాధితురాలికి ఎల్ఓసి అందించిన మాజీ ఎమ్మెల్యే
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన రజియా బేగం అనే మహిళ హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఇన్చార్జి మంత్రి బాధితురాలి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల నలభై వేల ఎల్ఓసిని మంజూరు చేశారు. ఎల్ ఓసి కాపీను మాజి ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తుందని వెల్లడించారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసానిస్తుందని తెలిపారు. వెంటనే స్పందించి ఎల్ఓసిని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు