

మనోరంజని ప్రతినిధి భైంసా : ఫిబ్రవరి 28:- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కాలనీకి చెందిన జంగ్మే గౌతమ్ అనే ప్రైవేటు ఉద్యోగి ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. నిజామాబాద్ లోని మనోరమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రతిరోజు చికిత్సకు అధిక ఖర్చు కావడం బాధిత కుటుంబానికి భారంగా మారుతున్నది. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 8985 700 586 గూగుల్ పే /ఫోన్ పే నెంబర్ కు సాయం అందించగలరని కోరారు. దాతల సాయమే తమకు కొండంత అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.