బహుజన సిద్ధాంతకర్త కాన్షిరాం బాటలో నడుద్దాం…తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకై కృషి చేద్దాం :

బహుజన సిద్ధాంతకర్త కాన్షిరాం బాటలో నడుద్దాం…తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకై కృషి చేద్దాం :

బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పెందూర్ అంకుష్ :

మనోరంజని ప్రతినిధి ఇంద్రవెల్లి : మార్చి 15 :- అట్టడుగు వర్గాల్లోని బహుజనులకు రాజ్యాధికారంతోనే న్యాయం చేకూరుతుందనే బలమైన సంకల్పంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 4సార్లు రాజ్యాధికారం తెచ్చిపెట్టిన బహుజన సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షిరాం అని బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పెందూర్ అంకుష్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బహుజన సంఘాలతో కలిసి మాన్యశ్రీ కాన్షిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.తదనంతరం హిరాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు,పెన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మాన్యశ్రీ కాన్షిరాం తాడిత, పీడిత వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు.ప్రతి ఒక్క బహుజనుడు కాన్షిరాం బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే మనోహర్,బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వావల్కర్ శివాజీ,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారే కాంరాజ్,బహుజన సంఘాల నాయకులు కాంబ్లే ఉత్తం, పరత్వాగ్ దత్త, భవాలే సత్యానంద్,దత్త ఆచార్య తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్