బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

చెన్నై: నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లు విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు.దీంతో, కోళ్ల ఫాంలలో గుడ్లు నిల్వలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో ఐదు రోజుల్లో గుడ్డుపై సుమారు 1.10 పైసలు తగ్గించి ప్రస్తుతం ఫాం ధర 3.80 పైసలుగా ఉంది. ప్రస్తుతం పాంలలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి పాడయ్యే అవకాశముందని, అలాగే, నిల్వలు కూడా పెరిగే అవకాశముందని ఫాం యజమానులు వాపోతున్నారు

  • Related Posts

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు! బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది.…

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    శాసనమండలి లో ఎమ్మెల్సీ కవిత ..

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక