

బనకచర్ల ప్రాజెక్ట్ పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి .
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణమా !
భవిష్యత్ లో గోదావరి జిల్లాల దాహర్తికి బాద్యులు ఎవరు ?
నేటి కృష్ణా డెల్టా పరిస్థితులు (ఆల్మెట్టి) గోదావరి నదికి ఎదురు కావని చెప్పగలరా !
మేడా శ్రీనివాస్ , ఆందోళన ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
మనోరంజని ప్రతినిధి రాజమండ్రి మార్చి 02 తమిళనాడు – కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమేనా మోడీ సర్కార్ బనకచర్ల ప్రాజెక్ట్ ఆలోచన తెర మీదకు తెస్తున్నారా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసారు ..నిపుణుల అభిప్రాయ సేకరణ లేకుండానే బనకచర్ల ప్రాజెక్ట్ కు చంద్రబాబు కూటమి మొగ్గు చూపటం పోలవరం ప్రాజెక్ట్ కు తూట్లు పొడవటం వంటిదని , గతంలో గోదావరి – పెన్నా నదుల అనుసంధానం తో ఎన్నో ప్రయోజనాలు వున్నాయన్న చంద్రబాబు నేడు గోదావరి – బనకచర్ల అనుసంధానం తెరమీదకు తేవటంలో ఆంతర్యం ఏమిటని , రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రజల జీవనాదారానికి సంబందించిన నీటి వనరుల సమస్యపై చంద్రబాబు పునరాలోచన చేయాలి . నీటి వనరులకు సంబందించిన అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిపుణుల అభిప్రాయానికి శాస్త్రీయ పరమైన కమిటీని నియమించి గోదావరి – బనకచర్ల నదుల అనుసంధానంపై భవిష్యత్ తరాలకు జరిగే నష్టంపై స్పష్టమైన నివేదికను తెలియచేయాలి . చంద్రబాబు మొగ్గు చూపుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నీటి అవసరాలకు అనేక ఇబ్బందులు తలెత్తె ప్రమాదాలు కనపడుతున్నాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు .. ప్రతిష్టాత్మకమైన పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను పూర్తి చేయకుండానే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి 70 వేల కోట్లు పై బడి నిధులు వెచ్చిస్తాం అని మోడీ సర్కార్ రాజకీయ నిర్ణయానికి చంద్రబాబు తల ఉపటం సరైన చర్య కాదు . ఒరిజినల్ డి పి ఆర్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తుతో ముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే నీటి వనరులు సమృద్ధిగా అన్ని ప్రాంతాలకు ఉపయోగపడతాయి . రైతాంగం కళ్ళల్లో వెలుగులు చ్చిమ్ముతాయి . గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఏపీ కి కేటాయించాల్సిన 1480 టి ఎం సి ల నీటి పంచాయితీనే నేటి వరకు తేల్చలేదు . అసలు గోదావరి జలాల తరలింపు అనుసంధానంతో ఏ ప్రాంతానికి మేలు జరుతుందో ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదు . ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు మోడీ సర్కార్ లేవనేత్తుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాన్ని గాని , నిపుణుల నిర్ణయాలను , మేధావులు సూచనలను ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలి . నీటి సమస్యలపై దుందుడుకు నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ పై ప్రభావం చూపుతాయని చంద్రబాబు గ్రహించాలి . మోడీ సర్కార్ చెబుతున్నట్టు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా పెద్దగా ఒరిగేదేమి లేదనే పెద్దల అభిప్రాయాలు కూడా ఎప్పటినుంచో వున్నాయి . మోడీ సర్కార్ చెబుతున్నట్టు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్ణయంపై చంద్రబాబు శాస్త్రయ పరమైన సూచనలు, నిర్ణయాలతో పునరాలోచన దిశగా ఆలోచించాలని ఆయన కోరారు . ప్రస్తుతానికి గోదావరి జలాలకు ఏ లోటు లేదు . తద్వారా కృష్ణా నది దాహర్తిని పుష్కలంగా తీరుస్తుంది . ఒకప్పుడు కృష్ణా నది జలాశయాలు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఎంతగానో ఆదుకుని మిగులు జలాలను ఇతర ప్రాంత నీటి అవసరాలకు అండగా నిలిచేది . కర్ణాటక డ్యామ్ ఎత్తు పెంచటం కారణంగా నేడు కృష్ణా నది నీటి ఏద్దడికి కారణంగా మారింది . ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఏ మాత్రం ఉపయోగం లేని బనకచర్ల ప్రాజెక్ట్ భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ లో నీటి వివాదాలకు దారి తీయదనే భరోసా వుందా ! 70 వేల కోట్ల పైభడి బనకచర్ల ప్రాజెక్ట్ పై దృషి సారించిన మోడీ సర్కార్ ముందుగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను ఒరిజినల్ డి పి ఆర్ మేరకు త్వరిత గతిన పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మోడీ కుట్రలో చంద్రబాబు మౌనం వహిస్తే భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన నీటి సమస్యలు పొంచి ఉంటాయి . బనకచర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సరిసద్దు మేరకు ఆశాస్త్రీయంగా నిర్మిస్తే భవిష్యత్ లో ప్రాంతాల మధ్య , రాష్ట్రాల మధ్య, మనుషుల మధ్య నీటి సమస్యలు ఏర్పడి అంతర్యుద్దాలు సంబవించే ప్రమాదాలు తలెత్తవచ్చును . దూరదృష్టి లేని పాలకుల ఆలోచనలు బావితరాల ఉజ్వల భవిష్యత్ కు అత్యంత ప్రమాద పరిస్థితులకు కారణం కావొచ్చునని ఆయన ముందస్తుగా హెచ్చిరించారు . ఉన్న పళంగా నరేంద్ర మోడీకి బనకచర్ల ప్రాజెక్ట్ ఆలోచన ఎందుకొచ్చిందో ఆలోచనా పరమైన ఆంధ్రులు గ్రహించాలి . ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి బకాయి ఉన్నటువంటి విభజన హామీలు , ప్రత్యేక హోదా , రెవిన్యూ వాటా నిధులను, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ , స్టీల్ ప్లాంట్ ప్రైవేటి కరణ సమస్యలను పరిష్కరించకుండా కొత్తగా బనకచర్ల ప్రాజెక్ట్ ను మోడీ సర్కార్ తెరమీదకు తేవటంలో రాజకీయ కుట్ర దాగి వుంది . తమిళనాడు – కర్ణాటక రాష్ట్రాల్లో మోడీ బిజెపి పార్టి పట్టు సాధించటం కోసం బనకచర్ల ప్రాజెక్ట్ ను రాజకీయ అస్త్రంగా మార్చుకుంటారనేది అంతర్గత రాజకీయ కుట్ర అనేదే నిజం అని నమ్మాలి . మోడీ బిజెపి పార్టికి ఉత్తరాదిన మతం , దక్షిణాదిన నీటి సమస్యలే ప్రధాన అజెండా లని , మోడీ రాజకీయ కుట్రలకు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు అడ్డుకట్ట వేయాలని , పోలవరం ప్రాజెక్ట్ నుండే గోదావరి – కావేరి నదులను అనుసంధానం చేసే మార్గం వున్నప్పటికి బనకచర్ల ప్రాజెక్ట్ పైనే మోడీ ఎక్కువగా మొగ్గు చూపటంలో పాదరసం వంటి కుట్ర దాగి వుందని చంద్రబాబు గమనించాలి . భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై చంద్రబాబు పునరాలోచన చేయాలి . నిపుణులతో చర్చించి శాస్త్రీయ పరమైన జ్ఞాన నిపుణుల కమిటీని నియమించాలి. ఒరిజినల్ డి పి ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్ట్ ను యుద్ధప్రాతిప్రదికన పూర్తి చేయాలి . ప్రత్యేక హోదా , విభజన హామీలపై మోడీ సర్కార్ పై చంద్రబాబు కూటమి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా ఒత్తిడి పెంచాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు ..సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .. ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణ మూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , ఆకుల మణికాంత్ , మోర్తా ప్రభాకర్ , వాడపల్లి జ్యోతిష్ , దుడ్డే త్రినాద్ , దొంగ బాలాజీ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బత్తెన శివన్నారాయణ , వల్లి శ్రీనివాసరావు , పిట్టా శ్రీనివాసరావు, చల్లా సాంబశివరావు , చిట్టూరి రవి కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు