

బడ్జెట్లో అన్ని వర్గాలకు కేటాయింపు పట్ల హర్షం
మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావుల గంగారెడ్డి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటును అందించే విధంగా ఉందని ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావుల గంగారెడ్డి హర్షo వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఉచిత కరెంటు- చేయూత- ఆరోగ్యశ్రీ- ఫ్రీబస్సు- రూ 500 గ్యాస్ సిలిండర్- ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా- రైతు భరోసా కు భారీగా నిధులు కేటాయించి ప్రజల బడ్జెట్ అని ప్రభుత్వం నిరూపించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజల అభ్యున్నతి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు బడ్జెట్ కేటాయింపులపై ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు