ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే❓

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే❓

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రావణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్ ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.
అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నం లో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు.

  • Related Posts

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు! బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది.…

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    శాసనమండలి లో ఎమ్మెల్సీ కవిత ..