ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ….
శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు