ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరుతో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది యువత చనిపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వారెంట్ జారీ చేయడంతో మనీలాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.