

ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు
సెంటర్ లను పరిశీలించిన తహశీల్దార్ శ్రీకాంత్
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని మూడు పరీక్ష కేంద్రాలు- మండలంలోని అష్టా ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి .విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు .ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. మండలంలో మొత్తం 701 మంది విద్యార్థులు పరీక్ష లు రాశారు. ముధోల్ ల్లోని రబింద్ర పాఠశాల పరీక్ష కేంద్రంలో240మంది విద్యార్థులు, ఆశ్రమ పరీక్ష కేంద్రంలో 167విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం లో 180మంది విద్యార్థులు, మండలంలోని అష్టా పరీక్ష కేంద్రంలో 114 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముధోల్ లోని మూడు పరీక్ష కేంద్రాలను ముధోల్ తహశీల్దార్ శ్రీకాంత్ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు