ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్ లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు బిఐఈ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్ లో హాజరు చేసుకోవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

  • Related Posts

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన…

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌! శ్రీకాకుళం జిల్లా – పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి