

ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ) మీడియంలో ఏఐ తరగతులను మండల విద్యాధికారి జి. రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్య యులు అబ్దుల్ అహద్, ఉపాధ్యాయురాలు మిస్బా మహీన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అక్తర్బి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత్ రావు, ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు సాయన్న పాల్గొన్నారు. సేవలను వినియోగించుకొని విద్యార్థులు మరింత మెరుగు పడాలని శుభాకాంక్షలు తెలియపరిచారు.