ప్రశ్నించే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే స్థాయికి ఎదిగింది

ప్రశ్నించే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే స్థాయికి ఎదిగింది

మనోరంజని ప్రతినిధి మార్చి 14 :-

  • 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు… మరెన్నో ఛీత్కారాలు
  • కష్ట కాలంలో అండగా నిలబడింది జన సైనికులు, వీర మహిళలే
  • ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల అభిమానం చూరగొన్నాం
  • 100 శాతం స్ట్రైక్ రేట్ సరికొత్త చరిత్రను లిఖించాం
  • పిఠాపురం జయకేతనం సభలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

‘జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో 11 ఏళ్లు ముగిశాయి. 12వ వసంతంలోకి అడుగుపెట్టాం. ఎన్నో అనుమానాలు… మరెన్నో అవమానాలు దాటుకొని దేశం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాం. ప్రశ్నించే పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీగా ఎదిగింది. అసలు ఈ పార్టీ ఏంట్రా.? అనే స్థాయి నుంచి పార్టీ అంటే ఇదేరా అన్న స్థాయికి చేరుకున్నాం. ఈ విజయం వెనుక వెన్నెముకలా నిలబడింది జన సైనికులు, వీర మహిళలే’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయ కేతనం సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “11 ఏళ్లు చాలా కష్టమైన ప్రయాణం చేశాం. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాం. ఈ ప్రయాణంలో తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరని పవన్ కళ్యాణ్ గౌరవించారు. కొంతమంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం అని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు మీ ముందు కూర్చున్నాం. నేను పార్టీలో చేరినప్పుడు ఆయన నాతో ఒక్కటే చెప్పారు… ఈ ప్రయాణం పదవుల కోసం కాదు… ప్రజలకు అండగా నిలబడే యువ నాయకత్వాన్ని తయారు చేయగలిగితే అదే చాలు అన్నారు. ఈ రోజు ప్రజలకు అండగా నిలబడే నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు.
• మాది ఎప్పుడూ ప్రజా పక్షమే
జనసేన పార్టీది ఎప్పుడూ ప్రజల పక్షమే. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా… అధికారంలోకి రాగానే మరోలా మారిపోయే పార్టీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ చేశాం. అధికారంలోకి రాగానే పల్లె రోడ్లకు మహర్దశ తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పల్లెల్లో 3300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. నాయకులు వెళ్లడానికే భయపడే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి మరీ రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నరసాపురం వేదికగా మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టే 217 జీవోను వ్యతిరేకించాం. అధికారపక్షంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జీవోను రద్దు చేశాం. వైసీపీ హయాంలో రైతుల ఇక్కట్లను తెలుసుకోవడానికి గోదావరి జిల్లాల్లో పర్యటించాము. కాకినాడలో దీక్ష కూడా చేశాం. అధికారంలోకి రాగానే 5.42 లక్షల మంది రైతుల నుంచి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.7800 కోట్లు 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో జమచేశాం. ప్రజలు మనస్ఫూర్తిగా జనసేన పార్టీని నమ్మారు కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఆశీర్వదించారు. జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తుంది.
• కూటమి స్ఫూర్తిని కాపాడే బాధ్యత మనపైనే ఎక్కువ
అమరావతిలో రైతుల పడుతున్న ఇక్కట్లను ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకువెళ్లింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు పరిస్థితి వివరించి వినతిపత్రం ఇచ్చి దానిని అడ్డుకున్నది పవన్ కళ్యాణ్ వేలాది మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారి కుటుంబాలకు అండగా నిలబడింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తన సొంత నిధులు నుంచి రూ. 5 కోట్లు ఇచ్చారు. ఇలా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇచ్చారా..? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి చాలా మంది కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భావ సభ కోసం తరలివచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. కూటమి అన్నాకా చిన్న చిన్న ఇబ్బందులు సహజం. వాటన్నింటిని అధిగమించి కలిసిమెలిసి ముందుకు సాగాలి. కూటమి స్ఫూర్తిని కొనసాగించాలి. కూటమి స్ఫూర్తిని పెంచే బాధ్యత తెలుగుదేశం, బీజేపీ నాయకుల కంటే మన పార్టీపైనే ఎక్కువ ఉంది. ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని శపథం చేసి మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారే. దానికి అనుగుణంగా మన ప్రయాణం సాగాలి. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇంత ఆర్థిక విధ్వంసం మునుపెన్నడు జరగలేదు. రాష్ట్రం కష్టకాలంలో ఉంది. తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చి తీరుతాం. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుకు ఎటువంటి స్ఫూర్తిని కొనసాగించారో… వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాల”ని కోరారు

  • Related Posts

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య? మనోరంజని ప్రతినిధి కర్నూలు జిల్లా: మార్చి 15 – కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు…

    ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

    ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి తెలంగాణ : తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన