

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.
మనోరంజని , మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 29 – మంచిర్యాల జిల్లా, భీమారం మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలను పూలతో అందంగా అలంకరించి, షడ్రుచుల ఉగాది పచ్చడిని తయారుచేసి అందరూ సంతోషంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాద్, ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు