

ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లా: మనోరంజని ప్రతినిధి మార్చి 28 -ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు చేపట్టినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ నియమాలను పాటించని పలు రైస్ మిల్లుల యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వానికి సమయానికి ధాన్యం అందివ్వని రైస్ మిల్లర్లు, అధికారుల తనిఖీల్లో ధాన్యం నిల్వలో తేడాలు ఉన్న 9 రైస్ మిల్లులను జప్తు చేసి, చట్ట ప్రకారం కేసులను నమోదు చేసినట్టు తెలిపారు. ధాన్యానికి సంబంధించి 38 కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని, 20 ఎకరాల రైస్ మిల్లర్ల యజమానుల భూములను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హెచ్చరించారు