ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 16 – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి,సెటైర్లు వేశారు. కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్‌ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 15 నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతభత్యాలు పొందుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఎమ్మె ల్యేగా కేసీఆర్ ఇప్పటి వరకూ రూ.57 లక్షల జీతం తీసుకుని కేవలం‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు తూ..”కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. నిద్రపోయే వారిని లేపొచ్చు కానీ.. నటించే వారిని లేపలేం. సభకు వచ్చి కేసీ ఆర్‌ విలువైన సూచనలు ఇవ్వాలి. ఆయన సభకు రాకుండానే లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు.

అసెంబ్లీకి కేసీఆర్‌ రారు.. ఆయన తన నియోజక వర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించరు. రైతుల ఆత్మహత్యలకు వారి అప్పులే ప్రధాన కారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ కింద చెల్లించాం. అన్నదాతలకు క్వింటాల్‌ వరికి రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండానే 1.57 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాంధించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని ప్రజలే అంటున్నారు. కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టులే రైతులకు నీరిస్తున్నాయి

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం