మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 14 -కల్తీ సరుకులు, నాసిరకం వస్తువులు, నాణ్యతలేన పరికరాలు సాంకేతికంగా మనిషి ఎంత ఎదుగుతున్న తమకు అవసరమైన వస్తువుల కొనుగోలులో మాత్రం ప్రజలకు మోసాలు అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. సగటు మధ్యతరగతి వినియోగదారులు తాము పొందిన సేవలు ,కొనుగోలు చేసిన వస్తువులలో లోపాలు ఉన్నట్లయితే నష్టపోవడం తప్ప చేసేదేమి లేదని బాధపడేవారు కోకొల్లలు. తమకోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని అవగాహన లేక తరచూ మోసపోతూ మదన పడుతున్న వినియోగదారులు అనునిత్యం తారస పడతారు. వారి హక్కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ,కోర్టులు ఉన్న సంగతి చాలామందికి తెలియని విషయం. స్థిరాస్తి, వ్యాపారం రియల్ ఎస్టేట్, వ్యాపారంలోనే ఒక స్థలాన్ని చూసి మరో స్థలాన్ని విక్రయించేవారు ఎక్కువయ్యారు . అంతేకాకుండా ఒకే స్థలాన్ని ఐదుగురికి విక్రయించే రియల్ ఎస్టేట్స్ బ్రోకర్లు పెరిగిపోయారు. నేడు శనివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మనోరంజని కథనం…
….. మార్చి 15 ఎందుకంటే….
స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన జాన్ ఎఫ్ కెనడా 1962 లో చారిత్రక ప్రకటన చేసిన రోజుగా మార్చి 15 గుర్తింపు పొందింది. కెనడా నిర్వచనం ప్రకారం వినియోగదారుడు అంటే మనమందరం ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక ,వర్గం, రక్షణ, సమాచారం, ఎంపిక విజ్ఞప్తి ఇవి ప్రకటించిన హక్కులు. 1972 లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకులు అన్వర్ ఫజల్ మార్చ్ 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గా జరుపుకోవాలని తీర్మానించారు. దీంతో అప్పటి నుంచి ఈ దినోత్సవం కొనసాగుతోంది.
…. వినియోగదారుల హక్కులు..
వినియోగదారులు కొన్ని వస్తువులు పొందే సేవల నాణ్యత ,ప్రమాణం, ధరల గురించి, సంపూర్ణ సమాచారం పొందవచ్చు. వినియోగదారులు వస్తువులు సేవలు తక్షణ అవసరాలు తీర్చగానే కాకుండా దీర్ఘకాలం ఎలా ఉండాలి అవి వినియోగదారుల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఆ భద్రత పొందడానికి కొన్ని వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలి. వీలైనంతవరకు ఐఎస్ఐ మార్క్స్, హేల్ మార్క్స్ వంటి నాణ్యత గల వస్తువులను కొనుగోలు చేయాలి. అనేక రకాల వస్తువులను సేవలకు తగిన సరసమైన ధరల్లో ఉండడం వినియోగదారుల హక్కు. వినియోగదారులు వినియోగదారుల వేదికపై తమ అభిప్రాయాలు వినిపించవచ్చు. అన్యాయమైన వాణిజ్య విధానాలు మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు.
….. ఎవరెవరు ఫిర్యాదు చేయొచ్చు ?
వినియోగదారుల పోరాన్ని ఎవరెవరు సంప్రదించవచ్చు అంటే ఎరువుల కల్తీ, తూకం తక్కువ, నాసిరకం విత్తనాలు, నకిలీ పురుగుమందులు వీటి బారినపడి నష్టపోతున్న రైతాంగం, విద్యుత్ కోత నెలకోసారి స్లాబ్ మార్చి అధిక చార్జీలు వసూలు చేసే విద్యుత్ శాఖ తీరుతో నష్టపోయేవారు. కొన్ని వస్తువులు నాణ్యత లేకపోయినా, చెడిపోయిన చౌక ధరల డీలర్లు సకాలంలో సరుకులు పంపిణీ చేయకపోతే ,సినిమా థియేటర్లలో సౌకర్యాలు లేకపోయినా ,పరిశుభ్రత లేకున్నా వైద్య సేవలో మున్సిపాలిటీలో లోపాలున్న మినరల్ వాటర్ పేరుతో సాధారణ వాటర్‌ను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న కల్తీ పాలు అమ్ముతున్న వినియోగదారుల పోరాన్ని సంప్రదించవచ్చు..
…. ఫిర్యాదులలో పేర్కొనవలసినవి….
ఫిర్యాదుదారుని పూర్తి పేరు చిరునామా పేర్కొనాలి. అవతలి పార్టీ పూర్తి పేరు చిరునామా ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఎప్పుడు ఏ విధంగా నష్టం జరిగిందో పేర్కొనాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రసీదు ,ఇతర వివరాలు జతచేస్తూ 20 లక్షల వరకు జిల్లా ఫోరంలో, 20 లక్షలకు మించి కోటి వరకు రాష్ట్ర కమిషన్ లో ఫిర్యాదు చేయవలసి ఉంటది. కొనుగోలు చేసిన లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్లలోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణాలు చూపుతూ రెండేళ్లు దాటిన తర్వాత ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.
….. జిల్లాలో….
వినియోగదారులకు న్యాయం చేయడానికి డిసెంబర్ 24, 1986లో పార్లమెంటులో వినియోగదారుల హక్కుల చట్టాలు తీసుకొచ్చారు. అనంతరం జిల్లాల్లో వినియోగదారుల పోరాన్ని 1987 లో ఏర్పాటు చేయగా ,పూర్తిస్థాయి ఫోరం మాత్రం 1993 లో ప్రారంభమైంది. మోసపోయామని భావించే వినియోగదారులు తాము కొనుగోలు చేసిన సేవలు, బిల్లులను తీసుకొని జిల్లా ఫోరంలో సంప్రదిస్తే సంబంధిత వినియోగదారులకు పూర్తి న్యాయ సహాయ సహకారాలు అందిస్తారు. వినియోగదారుడు తమకు జరిగిన నష్టాన్ని ఫోరం దృష్టికి తీసుకెళ్లొచ్చు. జిల్లా వినియోగదారుల కమిషన్ కోర్టులో ప్రస్తుతం
1 67 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
… నీటి వ్యాపారంలో దోపిడీ…
ఉమ్మడి జిల్లాలతో పాటు, పలు డివిజన్ కేంద్రాల్లోనూ ఐఎస్ఐ ముద్ర లేకుండా నీటి వ్యాపారం జరుగుతోంది. ఎండలు ముదురుతున్న వేళ తాగునీటి అవసరాలు పెరుగుతాయి వినియోగదారులను మోసం చేస్తున్న వాటర్ ప్లాంట్ల పైన సంబంధిత శాఖ అధికారులు దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నీటి వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
…. నిర్విరామ సేవలు చేస్తూ….
పట్టణానికి చెందిన తిరునగరి సింహయ్య జిరాయితినగర్ వెళ్లే దారిలో గల మాధవి విద్యాలయం పాఠశాల ద్వారా ఎందరో చిన్నారులను విద్యావంతుల్ని చేస్తూ, వినియోగదారుల ఫోరం ద్వారా నిర్విరామ సేవలు చేస్తున్నారు. జిల్లా వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులుగా, మండల వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తూ పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీలు నిర్వహించినారు.
పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో మండల వినియోగదారుల సంఘం కరపత్రాలను ఆర్డీవో రాజాగౌడ్ చేతుల మీదుగా ఇటీవల ఆవిష్కరించారు.. ఈ కరపత్రాల్లో వినియోగదారుల హక్కులను పూర్తిగా వివరించడం జరిగిందని తెలిపారు.
… చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం….
… పౌడపల్లి అనిల్, వినియోగదారుల మండలి డివిజన్ అధ్యక్షులు, ఆర్మూర్.
నగదు చెల్లించి వస్తువులు సేవలను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆహార కల్తీ మహమ్మారిపై చైతన్యవంతుల్ని చేసేలా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం