

ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలంలో అడవుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు, అలాగే అడెల్లి అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలకు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల రక్షణ, అటవీ నిప్పు వల్ల కలుగు పరిణామాలు, జీవవైవిద్యం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారిణులు స్వప్న, వెన్నెల, సుజాత పాల్గొని, ప్రజలకు అడవుల సంరక్షణలో వారి పాత్ర ఎంత కీలకమో వివరించారు. అడవుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు
