

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎస్పీకి బర్డ్ ఫీడర్ బహూకరణ
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 22 :- ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) అఖిల్ మహాజన్ ని సామాజిక కార్యకర్త, పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్ మరియు ఆడెపు శ్రీనివాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా పక్షులను కాపాడేందుకు బర్డ్ ఫీడర్‌ను బహూకరించారు.వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి కొరత ఏర్పడుతూ, అనేక పక్షి జాతులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఈ కార్యక్రమంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు మరియు ప్రకృతి వనరులు తగ్గిపోవడంతో పక్షులకు నివాసం దొరకడం కష్టమవుతోందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరిదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌లలో పక్షులకు నీటి తోట్టెలు, బర్డ్ ఫీడర్‌లు, పక్షి గూళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు