

ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –
ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ పేర్కొన్నారు. గురువారం ఖానాపూర్‌లో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్-బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పథకాల పట్ల ప్రజల్లో అపోహలు కలిగించేందుకు నిరంతరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే పథకాలు అర్హులందరికీ దశలవారీగా అమలు అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన గిరిజన, ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ ప్రాంత ప్రజలకు పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆత్రం రాజేశ్వర్, ఆత్రం వసంతరావు, ఊర్వేత ఆనందరావు, జాదవ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు