

ప్రతిపక్షం లేని అసెంబ్లీకి తాళం వేసి పార్టి కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించండి . ప్రభుత్వ ఖర్చును ఆదా చేయండి.
ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీ కి ప్రజా ప్రతిపక్షం అవసరం అని గ్రహించాలి ..
వుంది ఆనుకుంటున్న ప్రతిపక్షం మిత్రపక్షంగానే కొనసాగటం దురదృష్టం ..
ప్రతిపక్షం లేకపోతే ప్రశ్నించే భాద్యత ఎవరిది !
పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషించి తన పార్టి ప్రతిష్టను కాపాడుకోవాలి .
మేడా శ్రీనివాస్, సూచనలు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
ప్రతిపక్షం లేని ప్రభుత్వం పోకచెక్కతో సమానం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఏద్దేవా చేసారు ..
ప్రజాస్వామ్యంలో ప్రత్యేక్ష ఎన్నికల ద్వారా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు చట్ట సభలోను ప్రతిపక్షాన్ని గెలవాలి . అప్పుడే ఆ ప్రభుత్వానికి పరి పూర్ణనత వుంటుందని , ప్రజలు ప్రతిపక్ష స్థానం ఇచ్చి నప్పటికి నేను ప్రజల పక్షాణ ప్రశ్నించను మిత్రపక్షం గానే ఉంటాననటం ప్రజా ద్రోహంగా భావించాలి . ఎందుకో పవన్ కళ్యాణ్ అనాలోచితంగా ఆలోచిస్తు చారిత్రిక తప్పిదం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దండుల సలహాలు తీసుకుని ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని, లేకుంటే శృతిమించిన అధికారం నియంత పాలనను మరిపించే ప్రమాదం వుంటుందని గ్రహించాలి . ఏక పక్ష ధోరణిలో నడిచే శాసన సభ కు విలులతో కూడిన ప్రాధాన్యత ఉండదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి . ఏ చట్ట సభ కైనా ప్రతిపక్షంతో చర్చిన అనంతరం గెలిచిన వాదనకు మాత్రమే విలువ వుంటుందని , జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తారా ! లేదా అనేది చంద్రబాబు సర్కార్ అభిష్టం అని , పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదాను తీసుకోక పొతే మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిష్ట తీవ్రంగా నష్టపోతుంది . నిధులు ఖర్చు చేయటానికైనా , నిధులు సమీకరించటానికైనా ప్రతిపక్షం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ ఈ చిన్న లాజిక్ మిస్ కావటం ఆశ్చర్యంగా వుంది . ప్రస్తుతానికి మిత్రపక్షం బేషుక్ గా వున్నప్పటికి భవిష్యత్ లో తీవ్రమైన అపకీర్తిని మూటకట్టుకోవటం ఖాయం అని పవన్ కళ్యాణ్ గ్రహించక పొతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చిరించారు .ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసినప్పటికి ప్రజా తీర్పును గౌరవించటం ప్రజా ప్రతినిధుల కనీస బాధ్యత అని పవన్ కళ్యాణ్ మరువరాదు . ప్రతిపక్షం స్థానం ఉండగా మిత్రపక్షంగా కొనసాగటం. ప్రజా సమస్యలను గాలికి వదిలేయటం వంటిదని , నమ్మి బాధ్యతలను అప్పగించిన ప్రజలను అనాదులను చేయటం బాధ్యతా రాహిత్యంగానే బావించాలి . ప్రతిపక్షంగా అవకాశం వుండి కూడా మిత్రపక్షంగా కొనసాగటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అని , ఏక పక్ష నిర్ణయాలకు , తీర్మానాలకు , అభివృద్ధి , సంక్షేమంపై జరిగే పనులకు , అందుకై జరిగే చర్చకు పారదర్శకత తప్పనిసరని పవన్ కళ్యాణ్ కు తెలువదా ! తెలిస్తే ప్రతిపక్ష స్థానాన్ని అగౌరవ పరచటం ఆపకీర్తికి దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ ఆలోచించాలి . ప్రతిపక్ష స్థానం ఖాళీగా వుంటే జాతీయ అసెంబ్లీ సభల్లో ఆంధ్రప్రదేశ్ చట్ట సభను ఉదాహరణ లకు కామెడిగా చెప్పుకునే పరిస్థితులు ఎదురు కావొచ్చునని , రాష్ట్ర ప్రతిష్ట కోసమైనా ప్రతిపక్ష స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తి చేయాలి . ప్రశ్నించటమే తన అజెండాగా ప్రకటించుకుని రాజకీయ ఆరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ కు ప్రశ్నించేందుకు తగిన స్థానం దక్కినా వెనకడుగు వేయటం అనేక అనుమానాలకు తావిస్తుంది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రతిపక్ష స్తానం ఖాళీగా ఉండటం కూడా రాజ్యాంగ విరుద్ధమైన చర్యగానే అనుకోవాలి . 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి , 5 కోట్ల పై భడిన ఆంధ్రుల భద్రత , సంక్షేమం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఆదారపడి వుంది . అంత ప్రాధాన్యత గల మన రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షం స్థానం లేకపోవటం ప్రతి ఆంధ్రుడు ఆత్మగౌరవ ప్రతీకగానే బావించాల్సి వస్తుందని ఆయన మనస్థాపం చెందారు .చట్టసభ లో ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే ఆ చర్య సభకే అవమానంగా భావించాలి . రాజకీయ సమీకరణాల్లో భాగంగా జగన్ కు ప్రతిపక్ష హోదా చంద్రబాబు ఇవ్వకపోవచ్చును . ప్రస్తుతానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టి తోనైనా ప్రతిపక్ష స్థానాన్ని భర్తి చేసి చంద్రబాబు గొప్పతన్నాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వుంది . అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ను భర్తి చేసుకోక పొతే చారిత్రిక అపకీర్తిని సొంతం చేసుకోవటం ఖాయం . చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా నిర్వహించే సభలకు విలువ ఉండదు . అంత ప్రాధాన్యత ఉండదు అని చంద్రబాబు కూటమి గమనించాలి . ప్రతిపక్ష స్థానంపై పవన్ కళ్యాణ్ కు మక్కువ లేకపోయినా , చంద్రబాబు జగన్ కు ఆ స్థానం ఇవ్వటం ఇష్టం లేకపోయినా ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్డ్ కాభడి ప్రజా సమస్యలపై అనుభవం గల వారికి అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయాల్లో గౌరవ స్థానంగా ప్రతిపక్ష హోదాను నామినేట్ చేయటానికి ప్రత్యేక అధికారులుతో చంద్రబాబు ఆలోచన చేయాలి . అందుకై తాత్కాలిక జి వో ను విడుదల చేయొచ్చును , ఉన్న చట్టాల మేరకు అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టాన్ని సవరించి ప్రతిపక్ష హోదా స్థానాన్ని తాత్కాలికంగా భర్తి చేయాలి . ప్రతిపక్షం లేని అసెంబ్లీ పోకచెక్కతో సమానంగా అవమానాలు మిగిలిపోతాయి . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిష్ట కోసమైనా చంద్రబాబు మది నుండి ప్రతిపక్ష హోదా స్థానం భర్తి కావాలని, అసలు ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీ సమావేశాల అవసరం ఉంటుందా ! అందుకయ్యే ఖర్చు వృధా అని చంద్రబాబు గ్రహించాలని ఆయన సూచించారు . ప్రతిపక్ష స్థానంను పవన్ కళ్యాణ్ తీసుకోవాలి . లేకుంటే ఆ స్థానాన్ని చంద్రబాబు అభిష్టం మేరకు ఎవరికైనా భర్తి చేయాలి . ఇవి ఏమి కాదు అంటే అసెంబ్లీ కి తాళం వేసి అధికార పక్షం పార్టి కార్యాలయం లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుని ప్రభుత్వ ఖర్చును ఆదా చేయాలి . ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు . ప్రత్యేక హోదా , విభజన హామీలు లేవు . పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తి కాదు . విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ గానే ఉంటుందా ! ప్రైవేట్ పరమా ! అనే అంశం పై స్పష్టత లేదు . విభజన అనంతరం ఏ ఒక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి లభించలేదు . చివరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రతిపక్షం లేదు . ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రం లోను లేవు . దురదృష్ట వసాత్తు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పరిస్థితులు ఎందుకు వుంటున్నాయో అర్ధం కావటం లేదని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు .
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ సిమ్మా దుర్గారావు అధ్యక్షత అహించారు ..
ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , ఎమ్ డి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దోషి నిషాంత్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , నాగూరు అన్నపూర్ణ , మాసా సుభద్ర , మాసా ఏసు వాడపల్లి జ్యోతిష్ , సుంకర వెంకట భాస్కర రంగారావు , చల్లా సాంబశివరావు, వల్లి వెంకటేష్ , అడపా శేషగిరి , తదితరులు పాల్గొనియున్నారు ..