మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 12 :- ప్రజావాణి సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల పరిస్థితి, పట్టణీకరణ, హైడ్రా పనులపై వివరించారు. ప్రజావాణికి నేరుగా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఆన్లైన్లో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. త్వరలో హైడ్రా పోలీస్స్టేషన్ రాబోతుందని తెలిపారు. పెండింగ్ పిటిషన్లు 10 వేలకు పైగా ఉన్నాయని, ప్రతి సమస్య క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు