

ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే
మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 18 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండటం వలన సుమారు 40 మహిళలు శనివారం మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి దగ్గర దేగాం గ్రామంకు వచ్చి సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఉన్న బోర్లలో నీరు రావడం లేదు చేను నుండి తెచ్చుకుందాం అన్న అక్కడ కూడా బోర్లో నీరు రావడం లేదు మిషన్ భగీరథ నీరు అప్పుడప్పుడు వస్తున్నాయి. రాత్రి వేళలో గ్రామంలో తాగునీటి కోసం తిరగడం జరుగుతుంది. ఈ విషయాలు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. ఆయన దీనిపై స్పందించి సోమవారం రోజున బోర్ పంపటం జరిగింది. బోర్ కు నీరు కూడా చాలా బాగానే పడ్డాయి. ఆ ప్రాంతం మహిళలు, పురుషులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-జిల్లా ఇన్చార్జి మంత్రి-సీతక్క-మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు