

ప్రజలు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలి
-ఎంపీడీవో మధుసూదన్.
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.*మార్చి 24 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మధుసూదన్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ఐదు దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆయా సంబంధిత శాఖల అధికారులకు పంపించమని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సదానందం, ఎస్సై కె.శ్వేత, ఎంపీ ఓ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.