

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులు జర్నలిస్టులు.
-ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ప్రసన్న కుమార్.
-ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. 24 – ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పని చేయాలని లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కొండపర్తి ప్రసన్న కుమార్ సూచించారు. సోమవారం పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కొండపర్తి ప్రసన్న వ్యవహారించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ప్రజా సమస్యలతో పాటు జర్నలిస్టుల ఐక్యతకు, హక్కుల రక్షణకు కృషి చేయాలన్నారు. నిరంతరం ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ముందుండాలని దిశా, నిర్దేశం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులు గా అల్లంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా చీకటి తిరుపతి, ఉపాధ్యక్షులుగా భైరం లింగన్న, సుద్దపల్లి వేణుగోపాల్, కోశాధికారిగా మేడి భాను చందర్, ప్రచార కార్యదర్శులుగా ఖాదీర్ ఖాన్, బోరె రమేష్, కట్ల శంకర్, సంయుక్త కార్యదర్శులుగా పెండెం రాజశేఖర్, ఫయాజోద్దీన్, శ్రీనివాస్ చీకటి సాయి కిరణ్, కోనేటి రాజు, సభ్యులుగా ఏనుముల తిరుపతి, మధు చారి, కోల సత్యం, తొగరు రాజుతో పాటు మరో పది మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు