పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

మనోరంజని ప్రతినిధి అమరావతి: మార్చి 18 – పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణ ఈరోజు ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావే శంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు… ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా? లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా? అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

  • Related Posts

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. విశ్రాంత ఉద్యోగి ఏకపాత్రాభినయం… దద్దరిల్లిన కోదాడ వేదిక.. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.. తృతీయ బహుమతి అందుకున్న షాద్ నగర్ కళాకారుడు.. విశ్రాంత ఉద్యోగుల అభినందనలు ఆచార్య దేవా.. ఏమంటివి.. ఏమంటివి.. వయోవృద్ధులకు పోటీలో…

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం మనోరంజని ప్రతినిధి విజయవాడ :మార్చి 18 – విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరగనున్నాయి, ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..