
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు
కల్లూరు గ్రామంలో రహదారిపై మేకల సంత వల్ల ట్రాఫిక్ సమస్య
పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల విరుద్ధ చర్యలు
ఎస్సై చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని దుర్భాషలు పలికిన ఘటన
అరెస్టు చేసి కేసు నమోదు చేసిన కుంటాల పోలీసులు
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 01 నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో నేషనల్ హైవే పక్కన మేకల సంత జరుగుతున్న సమయంలో, రహదారిపై మేకలు, గొర్రెలను ఉంచడం వల్ల వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కుంటాల పోలీసులు పెట్రోలింగ్ వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే క్రమంలో, చాక్‌పల్లి గ్రామానికి చెందిన గోర మియా హుస్సేన్, అతని కుమారుడు ఫిర్దోస్ గోర మియా ఇద్దరూ పోలీసులకు సహకరించకుండా పైపైకి వచ్చారు. “మేము ఇలానే చేస్తాము, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు?” అంటూ ప్రతిఘటించారు. అంతేకాక, ఎస్సై చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, పోలీసు అధికారులకు దుర్భాషలాడారు.