

పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : విలువైన ఎలక్ట్రానిక్ పరికరాల కోసం దూరం వెళ్లకుండా షాద్ నగర్ పట్టణంలోని కనివిని ఎరుగని రీతిలో షోరూంను ప్రారంభించడం విశేషమని, మంచి నాణ్యత ప్రమాణాలు పాటించి ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజలకు అందజేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పరిగి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. షోరూం అధినేత రాజ్ కుమార్ తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తన వ్యక్తిగత కార్యదర్శి కాంగ్రెస్ కార్యకర్త అశోక్ కుమార్తె కోసం ఒక ల్యాప్టాప్ ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
పట్టణంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయాల కోసం పెద్ద ఎత్తున షోరూం ప్రారంభించడం విశేషం అన్నారు. ప్రతి చిన్న వస్తువు కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని షాప్ నిర్వాహకుడు రాజ్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కు షాప్ నిర్వాహకుడు మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి రఘునాయక్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, అగ్గనూర్ బస్వం, కేకే కృష్ణ, లింగారెడ్డిగూడెం అశోక్, దిలీప్, ముబారక్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు..