

పేదోడి అమృతం “అంబలి”
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో అంబలి కేంద్రం
కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం అంబలి సౌకర్యం ఏర్పాటు
అందుకే అతను “దట్ ఈజ్ శంకర్”
మనోరంజని ప్రతినిధి మార్చి 08- అంబలి పేదోడి అమృతమని అంబలి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నేతలు మాజీ జెడ్పిటిసి విశాల, మాజీ ఎంపీపీ ప్రియాంక గౌడ్, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అనసూయ, నాగమణి తదితరులతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా నాయకురాలతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ సమాజంలో కడుపునిండా అన్నం పెట్టే వారు మహిళలని అమ్మ అక్క ఎవరైనా సరే కడుపు చూస్తారని ఆకలిని తీర్చుతారని అన్నారు. ఇప్పుడంటే అన్నం తింటున్నాం కానీ.. చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళని అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని పోషక పదార్ధాలున్నాయని అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు ఇప్పుడు చెబుతుంటే.. మళ్ళీ చిరు ధాన్యాలవైపు దృష్టి సారించాం అన్నారు. రాగులతో చేసిన అంబలి తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంబలి ఒక దివ్య ఔషధమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రతిరోజు ఎంతో మంది ప్రజలు తమ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారని వారు ఎవరు ఆకలి దప్పికలకు గురికాకుండా తనవంతుగా అంబలి కేంద్రాన్ని క్యాంపు కార్యాలయంలో ఈ వేసవి కాలం మొత్తం సేవలు అందిస్తామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు విశాల శ్రావణ్ రెడ్డి, ప్రియాంక శివశంకర్ గౌడ్ లకు మహిళా దినోత్సవ సందర్భంగా వారికి అంబలి గ్లాసులను అందజేశారు.
“దట్ ఈజ్ శంకర్”
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూటే సపరేటు.. ఆయన వద్దకు వచ్చే వారికి పుష్కలంగా పండ్లు ఫలహారాలు అందిస్తూ ఉంటారు. ఆయన ఇంటికి వెళ్లిన కార్యాలయానికి వచ్చిన ఎల్లప్పుడు పండ్లు ఫలహారాలు పెడుతూనే ఉంటారు. అతిధి దేవోభవ అన్న సూక్తి ప్రకారం ఎమ్మెల్యే శంకర్ వద్దకు ఎవరు వచ్చినా పండో పలహారము ఆరగించనిదే ఎవరు వెళ్లలేరు. ఇక కాలానుగుణంగా ఆయన వద్దకు వచ్చేవారికోసం ఆకలి దప్పికలు తీర్చేందుకు కృషి చేస్తూ ఉంటారు తాజాగా అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినూత్నంగా ప్రారంభించడం విశేషం. కోటి తిప్పలు కూటి కొరకే అన్న సత్యం అందరికీ తెలుసు. మనిషి ఎన్ని వ్యా ప్రయాసలకు ఓర్చినా, నాన్న ఇబ్బందులు పడ్డ అన్ని పట్టడం కోసమే.. ఆకలి తీర్చుకోవడం కోసమే.. ఎమ్మెల్యే శంకర్ ఆకలి దప్పికలు తీర్చడంలో అందవేసిన చేయిగా చెప్పవచ్చు. తన సంపాదనలో ఎక్కువ మొత్తం ఖర్చుచేసి అనాధలకు అన్నార్తులకు ఆయన వద్దకు వచ్చే అతిధులకు తేడా లేకుండా ఆకలి తీర్చడం ఆయన నైజం. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద విద్యార్థులకు రోజు 500 మందికి పైగా ఉచిత భోజనాలను ఏర్పాటు చేయించిన ఘనత ఉంది. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఎవరైనా కసితో కొడతారు పగతో కొడతారు ఇతనేవరు ఒక పద్ధతిగా, జాగ్రత్తగా కొడతాడు అంటూ నటుడు తనికెళ్ల భరణి డైలాగ్ ఫేమస్.. షాద్ నగర్ లో ఎమ్మెల్యే శంకర్ గురించి ఎవరైనా ఇతర ప్రాంత వాసులు కొత్తవారు మాట్లాడుకుంటే ఇతను ఎవరు రా బాబు? పండ్లు పలహారాలు, అంబలి, అన్నం ఇలా జాగ్రత్తగా పద్ధతిగా పెడతాడు.. అంటూ ఆశ్చర్యపోక తప్పదు..
దట్ ఈజ్ శంకర్



