

పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 04 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ మండల కేంద్రంలోని మార్చ్ 03 నాడు, సాయంత్రం పూట రాంపూర్ గ్రామ శివారులోని ఇటుక బట్టి దగ్గర గల ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న 9 మందిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు ఆర్మూర్ పోలీస్ సిబ్బంది కలిసి పట్టుకొని, వారి వద్ద నుండి 45,110/- డబ్బులు,05 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఇట్టి రైడులో టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, ఆర్మూర్ ఎస్సై మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.