

పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి
మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్, పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రవీణ్ పగడాల మృతిపై సరైన న్యాయం చేయాలన్నారు. ఇండియన్ మిషన్ స్కూల్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో ప్రార్థనలు చేశారు