

పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. బుధవారం ఓదెల మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ లో పోలీసులు-మీకోసంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు, ప్యాడ్స్, పెన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి భయానికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై ధీకొండ రమేష్, ఎంఈఓ రమేష్ పాల్గొన్నారు