

పుస్ఫూరు గ్రామంలో హనుమాన్ గద ప్రతిష్ఠాపన
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 15 :-నిర్మల్ జిల్లాలోని పుస్ఫూరు గ్రామం పాత చెరువు కట్ట వద్ద రావి చెట్టు వద్ద హనుమాన్ గద ప్రత్యక్షమైంది. ఈ గదను గుర్తించిన అంజన్న స్వాములు గ్రామ పెద్దలతో కలిసి శనివారం కావడంతో భక్తి కార్యక్రమాలనుప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, విడిసి సభ్యులు, అంజన్న స్వాములు పెద్ద ఎత్తున భజన కీర్తనలతో ఉరేగింపు నిర్వహించారు. హనుమంతుని గద వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. జై హనుమాన్ నినాదాలతో గ్రామం మారుమోగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

